Kishan Reddy: కిషన్ రెడ్డిని కలిసిన ఏపీ రాజధాని రైతులు.. వారి పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉందన్న మంత్రి

  • హైదరాబాద్ వెళ్లిన అమరావతి రైతులు
  • బీజేపీ కార్యాలయంలో కిషన్ రెడ్డితో భేటీ
  • తమ సమస్యలు విన్నవించుకున్న రైతులు

ఏపీ రాజధాని రైతులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితో తమ సమస్యలను ఏకరవు పెట్టారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం జరిగేలా చూడాలని కిషన్ రెడ్డిని కోరారు. దీనిపై మంత్రి స్పందించారు. ఏపీ రాజధాని రైతుల పరిస్థితి చూస్తుంటే ముందు నుయ్యి వెనుక గొయ్యిలా ఉందని వ్యాఖ్యానించారు. అమరావతి రైతులు ఎంతో మంచి ఉద్దేశంతో తమ భూములు ఇచ్చారని, కానీ ఇప్పుడు వాళ్ల భూములపై అనిశ్చితి ఏర్పడిందని అన్నారు. రైతుల్లో భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి సూచించారు.

తాను కూడా ఈ విషయాన్ని ఏపీ సర్కారు దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. అంతకుముందు ఏపీ రాజధాని రైతులు కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అమరావతికి భారతదేశ మ్యాప్ లో స్థానం కల్పించడంపై ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వినతిపత్రం అందించారు.

Kishan Reddy
BJP
Andhra Pradesh
Amaravathi
Farmers
  • Loading...

More Telugu News