Karthi: అభిమాని మరణంతో కన్నీటిపర్యంతమైన హీరో కార్తీ

  • వ్యాసై అనే అభిమాని మృతి
  • రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
  • కన్నీళ్లాపుకోలేకపోయిన కార్తీ

తమిళ హీరో కార్తీకి దక్షిణాదిన భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సినిమాల వరకే కాదు కార్తీ పేరిట సామాజిక కార్యక్రమాలు నిర్వహించే అభిమానులు కూడా భారీగానే ఉన్నారు. కార్తీ కూడా తన ఫ్యాన్స్ పట్ల ఎంతో అనురాగం ప్రదర్శిస్తుంటారు. అయితే ఓ వీరాభిమాని మరణంతో కార్తీ కన్నీటిపర్యంతమయ్యాడు. వ్యాసై అనే అభిమాని కార్తీ మక్కల్ నాలా మండ్రం పేరుతో ఎన్నో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ కార్తీని ఆకట్టుకున్నాడు. కార్తీ కూడా వ్యాసైని ఎంతో ప్రోత్సహించేవాడు.

ఇటీవల వ్యాసై ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ విషయం తెలిసిన కార్తీ చలించిపోయాడు. అతడి భౌతిక కాయానికి నివాళులు అర్పించేందుకు వచ్చి ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకునేందుకు విఫలయత్నం చేశాడు. అంత్యక్రియల్లో పాల్గొనే సమయంలోనూ కార్తీ కళ్లలో నీళ్లు నిండాయి.

Karthi
Tamilnadu
Fan
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News