Botsa Satyanarayana: సముద్ర తీరానికి నష్టం జరగకుండా విశాఖలో మెట్రో రైల్ విస్తరణ: బొత్స

  • మెట్రో ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించిన మంత్రుల బృందం
  • అధికారులతో బొత్స, అవంతి సమీక్ష
  • త్వరలోనే టెండర్లు

విశాఖలో మెట్రో రైల్ వ్యవస్థ ఏర్పాటు, విస్తరణపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. మెట్రోరైలు ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. అనంతరం మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ పరిధిలో జరుగుతున్న పనులపై సమీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ, విశాఖ సముద్ర తీరానికి ఎలాంటి నష్టం జరగకుండా మెట్రో రైలు ప్రాజక్టు విస్తరణ ఉంటుందని తెలిపారు. దశల వారీగా జరిగే ఈ విస్తరణ కార్యక్రమంలో తొలి విడతలో 47 కిమీ మేర మెట్రో నిర్మాణం జరుపుతామని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ ఉంటుందని, మెట్రో ప్రాజెక్టు పనుల్లో పీపీపీ విధానం అమలు చేస్తామని చెప్పారు.

Botsa Satyanarayana
Vizag
Andhra Pradesh
Metro Rail
  • Loading...

More Telugu News