Taneti Vanitha: ఆ అమ్మాయిని ఎంత వేధించి ఉంటారో ఆలోచిస్తేనే భయం కలుగుతోంది: ఏపీ మంత్రి తానేటి వనిత

  • సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి ఘటన
  • ఘటనను ఖండించిన ఏపీ మంత్రి తానేటి వనిత
  • అమ్మాయిల పరిస్థితి భయంకరంగా తయారైందని ఆవేదన

ప్రియాంక రెడ్డి ఘటనపై ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. తాజాగా ఏపీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఈ ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రియాంక రెడ్డిని హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. అమ్మాయిల పరిస్థితి భయంకరంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గులు ప్రియాంకను ఎంత వేధించి ఉంటారో తలుచుకుంటేనే భయం వేస్తోందని వ్యాఖ్యానించారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. తమ పరిధిలో లేకపోయినా పోలీసులు రక్షణ కల్పించాలని తానేటి వనిత సూచించారు.

Taneti Vanitha
Andhra Pradesh
YSRCP
Disha
  • Loading...

More Telugu News