Jagan: జగన్ కు అనుకూలంగా లేవని ఏబీఎన్, టీవీ5 ప్రసారాలు ఆపేస్తారా?: యనమల

  • జగన్ మీడియాపై యనమల ఫైర్
  • అసత్యాల పత్రిక అంటూ విమర్శలు
  • అవినీతి సొమ్ముతో ఏర్పాటైందని వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇటీవలి పరిణామాల నేపథ్యంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ కు అనుకూలంగా లేవని ఏబీఎన్, టీవీ5 చానళ్ల ప్రసారాలను నిలిపివేస్తారా? అంటూ ప్రశ్నించారు. పాలన బాగుంటే పొగడటం, పాలన బాగాలేకపోతే విమర్శించడం మీడియా విధి అని పేర్కొన్నారు.

అంతేకాకుండా జగన్ మీడియా సంస్థలపైనా విమర్శలు చేశారు. పేపర్, టీవీ చానల్ ను జగన్ ఏ డబ్బుతో పెట్టారో చెప్పాలని నిలదీశారు. అవినీతి సొమ్ముతో అసత్యాలు రాయడానికే సాక్షి ఉందని ఆరోపించారు. జాతీయ మీడియా కూడా సాక్షిలో రాతల్ని తప్పుబట్టిందని అన్నారు. గత ఐదేళ్లలో రాసిన ఆ నీచపు రాతల్లో వాస్తవం ఎంత? అని ప్రశ్నించారు.

Jagan
Andhra Pradesh
YSRCP
Media
Telugudesam
Yanamala
  • Loading...

More Telugu News