Poonam Kaur: వాళ్లు జైలుశిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేనే జైలుకెళతాను: పూనమ్ కౌర్

  • తెలంగాణలో దారుణం
  • ఘోరంగా కడతేరిన ప్రియాంక రెడ్డి
  • భగ్గుమంటున్న పౌర సమాజం

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ప్రతి ఒక్కరిలోనూ తీవ్ర ఆగ్రహావేశాలు కలిగించింది. ప్రియాంకపై దారుణంగా అత్యాచారం చేసి ఆపై హతమార్చిన కిరాతకులను ఇప్పటికిప్పుడు చంపేయాలని డిమాండ్ చేస్తున్నవారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది. షాద్ నగర్ పీఎస్ వద్ద ఇవాళ కనిపించిన జనప్రభంజనం చూస్తే ఆ నలుగురు దుర్మార్గులపై ప్రజల్లో ఎంత కసి ఉందో అర్థమవుతుంది.

ఈ నేపథ్యంలో, సినీ నటి పూనమ్ కౌర్ కూడా ఆవేశంతో స్పందించారు. ఇలాంటి జంతువులను చంపడానికైనా తాను సిద్ధమేనని అన్నారు. ఇంతటి ఘాతుకానికి పాల్పడిన క్రూరులు జైలు శిక్ష అనుభవించడం కాదు, వాళ్లను చంపి నేను జైలుకెళతాను అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిందితుల్లో ఒకరి మతం గురించి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, ఇక్కడ మతం సమస్య కానేకాదని స్పష్టం చేశారు. అడవుల్లో అయినా కాస్త మేలేమో, కానీ ఈ జనారణ్యంలోనే మనుషులు అతిభయంకరంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇలాంటి సమస్యకు పరిష్కారాలు ఆలోచించాలే తప్ప రాజకీయాలు చేయాలని చూడొద్దని హితవు పలికారు. ఈ మేరకు ఫేస్ బుక్ లో వీడియో పోస్టు చేశారు.

Poonam Kaur
Tollywood
Disha
Hyderabad
Telangana
  • Loading...

More Telugu News