Maharashtra: నిబంధనలు ఉల్లంఘిస్తున్న 'మహా వికాస్ అఘాడీ' : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్
- ప్రొటెం స్పీకర్ కాళిదాసును మార్చడంపై మండిపాటు
- ఇది న్యాయసమ్మతం కాదని ఆగ్రహం
- గవర్నర్‌కు దీనిపై ఫిర్యాదు చేస్తామని హెచ్చరిక
మహారాష్ట్రలో 'మహా వికాస్ అఘాడీ' కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు రోజులు కూడా పూర్తికాలేదు అప్పుడే, కమలనాథులు ఆ పార్టీపై విమర్శల దాడి మొదలు పెట్టారు. సంకీర్ణ ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ మండిపడ్డారు.
కోర్టు నియమించిన ప్రొటెం స్పీకర్ కాళిదాసును మార్చి ఆయన స్థానంలో దిలీప్ వాల్పే పాటిల్ ను నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. బల పరీక్షకు అనుసరించాల్సిన విధివిధానాలను కూడా ప్రభుత్వం పాటించడం లేదని, అన్ని అంశాలపైనా గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని చంద్రకాంత్ స్పష్టం చేశారు. మొత్తం వ్యవహారాలపై త్వరలో సుప్రీంకోర్టు తలుపు కూడా తడతామని తెలిపారు.