India: ఈ చలికాలం ఎలా ఉంటుందో చెప్పిన భారత వాతావరణ విభాగం
- సాధారణం కంటే ఉష్ణోగ్రత అధికమన్న ఐఎండీ
- ఉత్తరాది రాష్ట్రాల్లో చలి ఉంటుందని వెల్లడి
- డిసెంబరు నుంచి ఫిబ్రవరి మధ్య కాలానికి తాజా అంచనాలు
సాధారణంగా వర్ష పాతం, తుపానుల వివరాలను అందించే భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ శీతాకాలం ఎలా ఉంటుందన్న అంచనాలు వెల్లడించింది. సహజంగా చలికాలాలకు భిన్నంగా ఈసారి వేడిగా ఉంటుందని తెలిపింది. చలి పాళ్లు కాస్త తక్కువగా నమోదవుతాయని, ప్రతి ఏటా నమోదయ్యే ఉష్ణోగ్రతల కంటే ఈసారి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని వివరించింది. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు తన తాజా అంచనాలు వర్తిస్తాయని ఐఎండీ పేర్కొంది. అయితే, ఉత్తరాదిన అత్యధిక ప్రాంతాల్లో యథాప్రకారం చలిగానే ఉంటుందని వెల్లడించింది.