Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు

  • ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఫిర్యాదు
  • సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు
  • జాతీయ మహిళా కమిషన్ కు, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు 

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై జాతీయ మహిళా కమిషన్ కు, లోక్ సభ స్పీకర్ కు ఏపీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఫిర్యాదు చేశారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీపై తమ్మినేని సీతారాం అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజకీయాల్లో ఉన్న మహిళలను కించపరిచేలా ఈ వ్యాఖ్యలు వున్నాయని ఆరోపించారు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన సోనియాగాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీతారాంపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాజ్యాంగ పదవిలో వున్న స్పీకర్ చేసిన వ్యాఖ్యలతో ఆ పదవికి కళంకం తెచ్చారని ఆరోపించారు.

Andhra Pradesh
Assembly speaker
Tammineni
Aicc
sunkara padma sri
Sonia Gandhi
Loksabha
  • Loading...

More Telugu News