Abhimanyu Mithun: ఒకే ఓవర్లో 5 వికెట్లు.... అభిమన్యు మిథున్ అద్భుతం!

  • దేశవాళీ క్రికెట్లో సూపర్ స్పెల్
  • హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు తీసిన మిథున్
  • హర్యానాపై నిప్పులు చెరిగిన కర్ణాటక పేసర్

భారత దేశవాళీ క్రికెట్లో అద్భుతం నమోదైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నమెంట్ లో కర్ణాటక ఫాస్ట్ బౌలర్ అభిమన్యు మిథున్ ఒకే ఓవర్లో 5 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. హర్యానాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మిథున్ ఒకే ఓవర్లో హ్యాట్రిక్ సహా ఐదు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఇన్నింగ్స్ చివర్లో విసిరిన ఈ ఓవర్ లో తొలి నాలుగు బంతులకు 4 వికెట్లు తీసిన అభిమన్యు మిథున్ ఐదో బంతికి వైడ్ వేశాడు. చివరి బంతికి సైతం వికెట్ తీసి రికార్డు నెలకొల్పాడు. అన్నట్టు.. అభిమన్యు మిథున్ ఎవరో కాదు, ప్రముఖ నటి రాధిక అల్లుడే. రాధిక కుమార్తె రయానే హార్డీని మిథున్ 2016లో వివాహమాడాడు.

Abhimanyu Mithun
Cricket
India
Radhika
  • Loading...

More Telugu News