Disha: ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని బహిరంగంగా శిక్షించాలి: పవన్ కల్యాణ్

  • ప్రియాంక రెడ్డి ఘటనపై స్పందించిన జనసేనాని
  • ఘటన తనను కలచివేసిందని వ్యాఖ్యలు
  • యువతులు, విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని సూచన

హైదరాబాద్ శివారు ప్రాంతంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి దారుణంగా హత్యకు గురైన ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శంషాబాద్ హత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మృతురాలి కుటుంబానికి జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు వెల్లడించారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని బహిరంగంగా శిక్షించాలని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర శివార్లలో పోలీస్ పెట్రోలింగ్, పర్యవేక్షణ పెంచాలని సూచించారు. విద్యార్థినులు, యువతుల్లో ఆత్మస్థైర్యం పెంచే మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలని పవన్ అభిప్రాయపడ్డారు.

Disha
Hyderabad
Telangana
Pawan Kalyan
Jana Sena
  • Loading...

More Telugu News