Maharashtra: ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టిన మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం
- కనీస ఉమ్మడి కార్యక్రమం ఏర్పాటు
- విడుదల చేసిన కూటమి నేతలు
- ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు చర్యలు
మహారాష్ట్రలో అనేక మలుపులు, నాటకీయ పరిణామాల అనంతరం మహారాష్ట్ర వికాస్ అఘాడీ పేరిట శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ క్రమంలో ఆయా పార్టీలు తమ ఎన్నికల హామీలను కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చాయి. ఈ హామీల్లో ముఖ్యంగా రూపాయికే ప్రాథమిక వైద్యం, రూ.10కే భోజనం, స్థానికులకు 80 శాతం ప్రైవేటు ఉద్యోగాలు, అందరికీ వైద్య బీమా, మురికివాడల పేదల రుణాల మాఫీ, బలహీన వర్గాల బాలికలకు ఉచిత విద్య తదితర అంశాలను కనీస ఉమ్మడి కార్యక్రమంలో చేర్చడమే కాకుండా, దానికి సంబంధించిన అజెండాను మూడు పార్టీల నేతలు విడుదల చేశారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఉద్ధవ్ థాకరే తన భాగస్వామ్య పార్టీలతో కలిసి కనీస ఉమ్మడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.