Disha: ప్రియాంక రెడ్డి తన చెల్లికి కాకుండా '100' నంబరుకు ఫోన్ చేసుంటే ఇలా జరిగేది కాదు: తెలంగాణ హోం మంత్రి

  • దుండగుల చేతిలో వెటర్నరీ డాక్టర్ బలి 
  • వెల్లువెత్తుతున్న ప్రజాగ్రహం
  • స్పందించిన తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ

సాయం కోసం చూస్తున్న ఓ అబలను అత్యంత దారుణంగా చెరిచి, ఆపై తగులబెట్టిన కిరాతక సంఘటనపై తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ స్పందించారు. జరిగిన ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు. పోలీసులు ఎంతో అప్రమత్తంగా ఉన్నారని, నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని వివరించారు. కానీ ప్రియాంక రెడ్డి '100' నంబరుకు కాకుండా తన చెల్లికి ఫోన్ చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ప్రియాంక రెడ్డి గనుక ఆ సమయంలో '100' నంబరుకు కాల్ చేసి ఉంటే ఆమెను పోలీసులు తప్పకుండా కాపాడేవాళ్లని తెలిపారు.

Disha
Telangana
Hyderabad
Police
Mahmood Ali
  • Loading...

More Telugu News