Chandrababu: చంద్రబాబు పర్యటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసిన వైసీపీ

  • సీఎం, మంత్రులకు ముప్పు వాటిల్లేలా డ్రోన్లు వాడారు
  • అనుమతి లేకుండానే డ్రోన్లను ఉపయోగించారు
  • తుళ్లూరు డీఎస్పీకి లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు

అమరావతి ప్రాంతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న చేపట్టిన పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న బస్సుపై కొందరు చెప్పులు, రాళ్లు రువ్వడం రాజకీయ వేడిని మరింత పెంచింది. వైసీపీ గూండాలే ఈ దాడికి పాల్పడ్డారని ఓ వైపు టీడీపీ నేతలు మండిపడుతుండగా... చంద్రబాబుపై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు పర్యటనపై తుళ్లూరు డీఎస్పీకి వైసీపీ నేత లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ముప్పు వాటిల్లేలా డ్రోన్లు వాడారని తన ఫిర్యాదులో అప్పిరెడ్డి పేర్కొన్నారు. సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో అనుమతి లేకుండానే డ్రోన్లను ఉపయోగించారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

Chandrababu
Amaravathi
Telugudesam
YSRCP
Lella Appireddy
  • Loading...

More Telugu News