Disha: ప్రియాంకరెడ్డి హత్య గురించి వింటుంటే నా కూతురికి జరిగిన ఘటనే గుర్తొస్తోంది: సినీ నటి ప్రత్యూష తల్లి

  • హత్య కేసులో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి
  • మరణశిక్ష విధిస్తే మహిళా లోకం ఆనందిస్తుంది
  • ప్రత్యూష ఛారిటబుల్ ట్రస్టు, మహిళల తరఫున కోరుకుంటున్నా

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ నటి ప్రత్యూష అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. తాజాగా డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య ఘటన నేపథ్యంలో ప్రత్యూష తల్లి స్పందించారు. ఈ సంఘటన గురించి వింటుంటే నాడు తన కూతురికి జరిగిన ఘటనే గుర్తొస్తోందని బాధపడ్డారు.

మహిళలు బయటకు వెళ్లినప్పుడు చాలా సమయస్ఫూర్తితో, తెలివిగా వ్యవహరించాలని చెప్పారు. ఇలాంటి విపత్కర సమయాల్లో మహిళలు తమ తల్లిదండ్రులకు, సోదరులకు, సమీపంలో వున్న స్నేహితులకు లేదా పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు. ప్రియాంకరెడ్డి హత్య కేసులో దోషులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని, మరణశిక్ష విధిస్తే మహిళా లోకం ఆనందిస్తుందని, మనోనిబ్బరాన్ని పెంచుకుంటుందని, ప్రత్యూష ఛారిటబుల్ ట్రస్టు, మహిళల తరఫున కోరుకుంటున్నట్టు చెప్పారు.

Disha
veternary Doctor
Artist
Pratusha
Mother
Shadnagar
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News