Disha: ప్రియాంక రెడ్డి ఘటనలో పోలీసుల తీరుపై పూనమ్ కౌర్ తీవ్ర వ్యాఖ్యలు

  • అత్యాచారం జరిపి ఆపై హత్య చేసిన దుండగులు 
  • ఆపై పెట్రోల్ పోసి దహనం 
  • సంచలనం సృష్టించిన ఘటన

హైదరాబాద్ శివార్లలో ఓ మహిళా వెటర్నరీ డాక్టర్ పై దారుణంగా అత్యాచారానికి పాల్పడి ఆపై, హత్య చేసి దహనం చేసిన ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. తమ కుమార్తె ఇంటికి రాకపోవడంతో ప్రియాంక తండ్రి పోలీసులను ఆశ్రయించగా, మీ కుమార్తె ఎవరితోనో వెళ్లిపోయుంటుందేమో అని పోలీసులు చులకనగా మాట్లాడినట్టు తెలిసింది. దీనిపై నటి పూనమ్ కౌర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపదలో ఉన్న ఓ అమ్మాయిని లేచిపోయిందేమో అనడానికి పోలీసులకు సిగ్గు లేదా? అంటూ మండిపడ్డారు. అసహ్యంగా ఉంది, పోలీసుల తీరు మర్యాదకరం అనిపించుకోదు అంటూ వ్యాఖ్యానించారు.

Disha
Telangana
Hyderabad
Police
Poonam Kaur
  • Error fetching data: Network response was not ok

More Telugu News