Crime News: ఆ మృగాళ్లంతా 25 ఏళ్లలోపు వారే... ప్రియాంకారెడ్డిపై అత్యాచారం, సజీవ దహనం కేసులో నిందితులు వీరే!

  • మొత్తం ఐదుగురు ఉన్నట్లు అనుమానం 
  • ప్రధాన నిందితుడు మక్తల్ మండలానికి చెందిన మహ్మద్ పాషా అరెస్టు 
  • నిందితులు చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివ అరెస్టు
  • పరారీలో మరో నిందితుడు

పశు వైద్యాధికారిణి ప్రియాంకారెడ్డి అపహరణ, అత్యాచారం, హత్య ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితులంతా 25 ఏళ్లలోపు వారేనని తేల్చారు. ఈ ఘటనకు ఐదుగురు కలిసి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. నారాయణ పేట, మక్తల్ మండలం జక్లేరుకు చెందిన మహ్మద్ పాషాను అరెస్టు చేశారు. ఈ కేసులో ఇతడే ప్రధాన నిందితుడు.

అదే మండలంలోని గుడిగండ్లకు చెందిన చెన్నకేశవులు, జొల్లు నవీన్, జొల్లు శివతో పాటు మరో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు  పరారీలో ఉన్నాడు. హైదరాబాద్ నుంచి రాయచూర్ కు డీసీఎంలో నిందితులు స్టీల్ రాడ్లను తరలించే పనిలో ఉన్నట్లు తెలిపారు. లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేస్తోన్న వీరే ప్రియాంకారెడ్డిని హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

Crime News
Hyderabad
Nizamabad District
narayanapeta
  • Loading...

More Telugu News