Telugudesam spokesperson Budda Venkanna criticism on YS Jagan: నిజమైన నిరుద్యోగికి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ?: టీడీపీ నేత బుద్ధా వెంకన్న

  • మీ హయాంలో రాష్ట్రంలోకి ఒక్క కంపెనీ రాలేదని ఎద్దేవా
  • తమ కార్యకర్తలకే ఉద్యోగాలు ఇచ్చుకున్నారని విమర్శ
  • రిజర్వేషన్లు వారికే అమలుచేసి నిజమైన నిరుద్యోగులను మోసం చేశారు

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.  రాష్ట్రంలో  పరిశ్రమల స్థాపనపై టీడీపీ నేత, పార్టీ అధికార ప్రతినిధి బుద్ధా వెంకన్న వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇందుకు మాధ్యమంగా ట్విట్టర్ ను ఎంచుకున్నారు. ‘మీ మొహం చూసి ఒక్క కంపెనీ అయినా ఏపీకి వచ్చిందా? జగన్ గారిని చూసి ఎవరైనా ఏడవటానికి.. అసలు ఏం చేసారని ?’ అని ట్వీట్ చేశారు.

అంతకు ముందు వెంకన్న రాష్ట్రంలో వైసీపీ సర్కారు ఉద్యోగాల్లో తమకు సంబంధించిన వారికే ఉద్యోగాలిచ్చిందంటూ ధ్వజమెత్తారు. గ్రామ వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తలకు వందశాతం రిజర్వేషన్ తో ఉద్యోగాలు ఇచ్చుకొని నిజమైన నిరుద్యోగులను మోసం చేశారని పేర్కొన్నారు. గ్రామ సచివాలయ పరీక్షా పత్రం లీక్ చేసి ఒక్కో ఉద్యోగం రూ.5 లక్షలకు అమ్ముకొని 20 లక్షల మంది నిరుద్యోగులను ముంచారన్నారు.

ఈ విషయంలో వైఎస్, జగన్, ఎంపీ విజయ్ సాయిరెడ్డిలకు సవాల్ విసురుతూ.. ఈ ఆరు నెలల్లో వైసీపీ కార్యకర్తలకు కాకుండా నిజమైన నిరుద్యోగికి ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా ? అని ప్రశ్నించారు.

Telugudesam spokesperson Budda Venkanna criticism on YS Jagan
Andhra Pradesh
  • Loading...

More Telugu News