Twitter: కర్మ కాకపోతే ఇంకేంటి?: ప్రియాంక హత్య ఘటనపై నటి కీర్తి సురేశ్

  • పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి
  • హైదరాబాద్ వంటి నగరంలో ఎవరిని నిందించాలి?
  • ట్విట్టర్ లో స్పందించిన కీర్తి సురేశ్

డాక్టర్ ప్రియాంకా రెడ్డి హత్యాచారంపై నటి కీర్తి సురేశ్ స్పందించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెడుతూ, తాను కర్మను నమ్ముతానని, అది అనుక్షణం వెంటాడుతూనే ఉంటుందని వ్యాఖ్యానించింది.

"డాక్టర్ ప్రియాంకా రెడ్డిపై అత్యాచారానికి పాల్పడి, సజీవదహనం చేశారన్న వార్త నా హృదయాన్ని కలచివేసింది. రోజురోజుకూ పరిస్థితులు చాలా దారుణంగా మారుతున్నాయి. మహిళలకు ఎంతో సురక్షితమైనదని భావించే హైదరాబాద్ వంటి నగరంలో ఇంత దారుణ ఘటనకు ఎవరిని నిందించాలి? రోజులో ఏ సమయంలోనైనా ఓ అమ్మాయి సురక్షితంగా తిరిగే రోజులు ఇండియాలో ఎప్పుడు వస్తాయి? నిందితులందరికీ కఠిన శిక్ష విధించాల్సిందే. ఆమె కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఈ కష్టం నుంచి వారు త్వరగా బయట పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను కర్మను నమ్ముతాను. అది 24/7 పనిచేస్తూనే ఉంటుంది" అని పేర్కొంది.

Twitter
Keerthi Suresh
Disha
  • Error fetching data: Network response was not ok

More Telugu News