Sadhvi Pragya Thakur: మధ్యప్రదేశ్ లో అడుగుపెడితే ఆమెను సజీవంగా తగలబెడతాం: కాంగ్రెస్ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు

  • గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించిన సాధ్వి
  • మండిపడుతున్న విపక్షాలు
  • సొంత నియోజకవర్గంలో కూడా నిరసన సెగలు

మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సేను దేశ భక్తుడిగా కీర్తించిన బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ పై విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గోవర్ధన్ డంగి మాట్లాడుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రదేశ్ లో ప్రజ్ఞా ఠాకూర్ అడుగుపెడితే ఆమెను సజీవంగా తగలబెడతామని హెచ్చరించారు.

లోక్ సభలో బుధవారం నాడు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) బిల్లుపై చర్చ సందర్భంగా గాడ్సేను కీర్తిస్తూ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత ఎదురవడంతో... కేంద్ర ప్రభుత్వం ఆమెను డిఫెన్స్ ప్యానల్ నుంచి తొలగించింది. అయినప్పటికీ, ఈ వివాదం ఇంకా సద్దుమణగలేదు. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లోక్ సభ నియోజకవర్గానికి సాధ్వి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో, భోపాల్ లో కూడా నిన్న నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

Sadhvi Pragya Thakur
BJP
Nathuram Godse
Mahatma Gandhi
Congress
MLA Govardhan Dangi
  • Loading...

More Telugu News