DGP: మహిళలకు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కీలక సూచన!

  • ప్రమాదంలో వున్న వారు 100కు ఫోన్ చేయండి
  •  9490617111, 9490616555 నంబర్లను వినియోగించుకోండి
  • సమాచారం అందితే వెంటనే సాయం చేసేందుకు వస్తామన్న డీజీపీ

పశు వైద్యురాలు ప్రియాంక హత్యాచారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపగా, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి మహిళలకు, ముఖ్యంగా చీకటి పడిన తరువాత ప్రయాణాలు చేసేవారికి కీలక సూచనలు చేశారు. రాత్రి సమయాల్లో వృద్ధులు, అమ్మాయిలు ప్రయాణిస్తున్న వాహనాలు ట్రబుల్ ఇస్తే, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ఏదైనా ప్రమాదంలో వున్న వారు వెంటనే 100కు, 9490617111 నంబర్‌ కు ఫోన్‌ చేయాలని కోరారు.

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షీ టీమ్స్‌ వాట్సాప్‌ నంబర్లను ట్వీట్ చేసిన ఆయన, సాయం కోరేందుకు మొహమాటపడవద్దని, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఇక రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సైతం ఇవే సూచనలు చేస్తూ, షీ టీమ్స్‌ ల్యాండ్‌ లైన్‌ నంబరు 040-2785 2355, వాట్సాప్‌ నంబరు 9490616555ను వినియోగించుకోవాలని సూచించారు. తమకు సమాచారం అందితే, పోలీసు టీమ్ వెంటనే సాయం చేసేందుకు వస్తుందని తెలిపారు. సాయం కోసం టోల్‌ ఫ్రీ నంబర్లు 112, 1090, 1091 కూడా వినియోగించుకోవచ్చన్నారు.

DGP
Mahender Reddy
Ladies
She Teams
Night
  • Loading...

More Telugu News