karthi chidambaram: కార్తీ చిదంబరం అరెస్ట్ కోసం రంగం సిద్ధం చేసిన ఈడీ

  • స్టే ఎత్తివేయగానే అరెస్ట్ చేస్తామన్న ఈడీ
  • కోర్టుకు తెలిపిన సొలిసిటర్ జనరల్
  • చిదంబరం బెయిలు పిటిషన్‌పై తీర్పు రిజర్వు

కేంద్రమాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ అరెస్ట్ కోసం ఈడీ కాసుక్కూర్చుంది. ఆయన అరెస్ట్‌పై ఉన్న స్టే ఎత్తివేయగానే అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. స్టే ఎత్తివేసిన మరుక్షణం కార్తీ చిదంబరాన్ని అరెస్ట్ చేస్తామని ఈడీ తరపున కోర్టులో వాదనలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు తెలిపారు. సీబీఐ దర్యాప్తు చేస్తున్న అవినీతి కేసులో మాత్రమే కార్తీ బెయిలుపై ఉన్నారని, ఈడీ కేసులో కాదని కోర్టుకు తెలిపారు. కాగా, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చిదంబరం బెయిలు పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసింది. మరోవైపు, ఈడీ కేసులో కార్తీ చిదంబరం ఇప్పటి వరకు బెయిలు కోసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.

karthi chidambaram
ED
arrest
  • Loading...

More Telugu News