Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాస్త ముందుగానే వస్తున్న 'జాను'
  • యాక్షన్ తో 'ఫైటర్' మొదలు 
  • ఈషా రెబ్బాకు మరో ఆఫర్  

   *  శర్వానంద్, సమంత జంటగా రూపొందుతున్న '96' తమిళ చిత్రం రీమేక్ అయిన 'జాను' షూటింగును పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో బిజీగా వుంది. కాగా, ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయాలని మొదట్లో అనుకున్నప్పటికీ, ఫిబ్రవరి 7న విడుదల చేస్తున్నట్టు తాజా సమాచారం.
*  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందే 'ఫైటర్' చిత్రం షూటింగును వచ్చే నెలాఖరు నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. మొదటి షెడ్యూల్ ను యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభిస్తారట.  
*  ఇటీవల వచ్చిన 'రాగల 24 గంటల్లో' చిత్రంలో నటించిన తెలుగమ్మాయి ఈషా రెబ్బా తాజాగా మరో చిత్రంలో నటించే అవకాశాన్ని అందుకుంది. సుశాంత్ హీరోగా నూతన దర్శకుడు వెంకట్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె కథానాయికగా నటిస్తుంది.

Samantha
Puri Jagannadh
Vijay Devarakonda
Esha Rebba
  • Loading...

More Telugu News