byreddy rajasekhar reddy: బీజేపీ తీర్థం పుచ్చుకున్న బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

  • జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
  • బైరెడ్డి కుమార్తె శబరి కూడా..
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన నడ్డా

రాయలసీమకు చెందిన మరో నేత బీజేపీలో చేరారు. సీనియర్ నేత, రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నిన్న సాయంత్రం బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పార్టీలో చేరారు. బైరెడ్డితోపాటు ఆయన కుమార్తె శబరి కూడా కమలం కండువా కప్పుకున్నారు.

ఈ కార్యక్రమంలో  బీజేపీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్, ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. టీడీపీ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి 1994లో టీడీపీ టీకెట్‌పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2012లో టీడీపీ నుంచి బయటకు వచ్చి రాయలసీమ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరిన ఆయన తాజాగా పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు.

byreddy rajasekhar reddy
rayalaseema
BJP
  • Loading...

More Telugu News