Verma movie: వర్మ సినిమా టైటిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం

  • వర్మ రూపొందించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం
  •  ఈ చిత్రం టైటిల్ మార్చాలి
  • సెన్సార్ బోర్డు అధికారుకుల ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల లేఖ

‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అన్న వివాదాస్పద టైటిల్ తో సినిమా తీసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం నుంచి చుక్కెదురైంది. ఈ సినిమా టైటిల్ పై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. టైటిల్ ను మార్చాలని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారులకు లేఖ రాశారు. ఇప్పటికే ఈ సినిమాపై కొంతమంది హైకోర్టులో కేసు వేసిన విషయం తెలిసిందే. సినిమా చూసి పరిశీలనార్హమైన అంశాలను తమకు వారంరోజుల్లో తెలపాలని కోర్టు సెన్సార్ బోర్డును ఆదేశించింది.

Verma movie
Title change demand
AP Govt letter to censor board
Andhra Pradesh
  • Loading...

More Telugu News