Balakrishna: బాలకృష్ణ, రకుల్, మంచు మనోజ్ లకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన మంచు లక్ష్మి

  • ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్
  • ప్రముఖుల నుంచి విశేష స్పందన
  • సుమ ఛాలెంజ్ ను స్వీకరించిన మంచు లక్ష్మి

తెలంగాణ వ్యాప్తంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముమ్మరంగా సాగుతోంది. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ మొక్కలు నాటే ఛాలెంజ్ కు ప్రముఖుల నుంచి విశేషమైన రీతిలో స్పందన వస్తోంది. తాజాగా యాంకర్ సుమ నుంచి ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన మంచు లక్ష్మి తన నివాసంలో మొక్క నాటారు. అనంతరం ఛాలెంజ్ లో భాగంగా మరో ముగ్గుర్ని నామినేట్ చేశారు. నందమూరి బాలకృష్ణ, రకుల్ ప్రీత్ సింగ్ లతో పాటు తన సోదరుడు మంచు మనోజ్ కు కూడా ఛాలెంజ్ విసిరారు.

Balakrishna
Rakul Preet
Manchu Manoj
Tollywood
Green India Challenge
  • Loading...

More Telugu News