Telugudesam: రాజధాని ప్రాంతంలో చంద్రబాబుతో పాటు గల్లా జయదేవ్ కూడా కుంభకోణాలకు పాల్పడ్డారు: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

  • ఏపీలో గత ప్రభుత్వ పాలన అవినీతిమయం
  • చంద్రబాబు హయాంలో ఏపీలో తీవ్ర అవినీతి నెలకొంది
  • ఈ విషయాన్ని ఎన్సీఏఈఆర్ నివేదికే చెప్పింది

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఎంపీ గల్లా జయదేవ్ పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఏపీలో గత ప్రభుత్వ పాలన అవినీతిమయమని, రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సహా గల్లా జయదేవ్ కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలపై అధ్యయనం చేసే ఎన్సీఏఈఆర్ ఇచ్చిన నివేదికలో చంద్రబాబు నేత‌ృత్వంలో ఏపీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయిందని చెప్పడమే అందుకు ఉదాహరణ అని అన్నారు. వీటన్నింటిపై విచారణ జరపాలని ప్రధాని మోదీని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.

Telugudesam
Chandrababu
YSRCP
mp
Mithun
  • Loading...

More Telugu News