RGV: ట్రోల్ చేయడానికి పవన్ కల్యాణ్ అనువుగా ఉంటాడు: వర్మ

  • ఓ వార్తా చానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ
  • చిరంజీవిని ట్రోల్ చేయడం కష్టమని వ్యాఖ్యలు
  • పవన్ వ్యక్తిత్వంలోనే ఆ అవకాశం ఉందని వెల్లడి

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన కొత్త చిత్రం 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' ('అమ్మరాజ్యంలో కడప బిడ్డలు'గా మారుస్తామంటున్నారు) విడుదలపై అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో వర్మ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ పై ఎక్కువ వ్యాఖ్యలు చేయడానికి, పవన్ ను ట్రోల్ చేయడానికి గల కారణాలను విశ్లేషించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిత్వమే ట్రోల్ చేసేవిధంగా ఉంటుందని స్పష్టం చేశారు. పవన్ వ్యవహారశైలి ట్రోలింగ్ కు అవకాశమిచ్చేలా ఉంటుందని, పవన్ ను ట్రోల్ చేసినట్టు చిరంజీవిని ట్రోల్ చేయలేమని తెలిపారు. అంతేగాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ట్రోల్ చేయొచ్చు కానీ, బరాక్ ఒబామాను ట్రోల్ చేయలేమని అన్నారు. ఇది ఒకరిని టార్గెట్ చేస్తున్నామని కాకుండా, వారి వ్యక్తిత్వంలోనే ఆ అవకాశం ఉన్నట్టుగా భావించాలని వర్మ పేర్కొన్నారు.

RGV
Pawan Kalyan
Tollywood
Andhra Pradesh
Jana Sena
  • Loading...

More Telugu News