Navaratnalu: ఏపీలో నవరత్నాల అమలుకు రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు

  • సీఎం అధ్యక్షతన రాష్ట్ర కమిటీ
  • జిల్లా స్థాయి కమిటీకి అధ్యక్షుడిగా జిల్లా ఇన్ చార్జి మంత్రి
  • నవరత్నాల అమలు ఆర్టీజీఎస్ ద్వారా పర్యవేక్షణ

వైసీపీ సర్కారు నవరత్నాల పథకాల అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. వైసీపీ ఎన్నికల అజెండాలో నవరత్నాలే కీలకంగా ఉన్న నేపథ్యంలో, వాటి అమలు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రస్థాయిలో సీఎం అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో ప్రభుత్వ సలహాదారు శామ్యూల్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. 25 మందితో కూడిన ఈ కమిటీలో వివిధ శాఖల మంత్రులు, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.

ఇక, జిల్లాస్థాయి కమిటీకి జిల్లా ఇన్ చార్జి మంత్రి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. సంబంధిత జిల్లా మంత్రులు, జిల్లాల్లోని వివిధ శాఖాధిపతులు సభ్యులుగా ఉంటారు. అంతేగాకుండా, నవరత్నాల అమలును ఆర్టీజీఎస్ తో అనుసంధానించనున్నారు. ఆర్టీజీఎస్ ద్వారా పథకాల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపొందించనున్నారు.

  • Loading...

More Telugu News