kamma Rajyamlo kadpa redlu movie: రాంగోపాల్ వర్మ సినిమా విడుదలకు హైకోర్టు బ్రేక్

  • సినిమా ఇతివృత్తం, టైటిల్ పై విచారణ చేపట్టిన హైకోర్టు
  • అభ్యంతరాలు పరిశీలించాలని సెన్సార్ బోర్డుకు ఆదేశం
  • టైటిల్ మార్చామన్న వర్మ తరపు న్యాయవాది వినతి

రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సినిమా రిలీజ్ కు చిత్ర యూనిట్ సన్నద్ధమవుతున్న సమయంలో దీనిపై కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. సినిమాతో పాటు టైటిల్ ను పిటిషనర్లు సవాల్ చేశారు. సీబీఎఫ్ సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఎలా ఇస్తుందంటూ తమ పిటిషన్లో ప్రశ్నించారు.

ఈ నేపథ్యంలో హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. తాజాగా హైకోర్టు సీబీఎఫ్ సీకి ఆదేశాలు జారీచేస్తూ.. వారం రోజుల్లోగా సినిమాను చూసి అభ్యంతరాలను పరిశీలనకు తీసుకోవాలంది. ఇప్పటికే టైటిల్ ను ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’గా మార్చామని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు.

  • Loading...

More Telugu News