Vakkantham Vamsi: వక్కంతం వంశీ దర్శకత్వంలో వరుణ్ తేజ్

  • సినీ కథా రచయితగా మంచి పేరు 
  • దర్శకుడిగా 'నా పేరు సూర్య'తో పరాజయం 
  • తదుపరి సినిమాకి నిర్మాతగా అల్లు అరవింద్

సినీ కథా రచయితగా వక్కంతం వంశీకి మంచి పేరు వుంది. ఆయన కథలతో రూపొందిన కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. అలాంటి ఆయన 'నా పేరు సూర్య' సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా పరాజయాన్ని చవిచూసింది. దాంతో ఏడాదిన్నరగా వక్కంతం వంశీ నుంచి ఎలాంటి సినిమాలేదు.

తాజాగా ఆయన ఒక లైన్ సిద్ధం చేసుకుని, వరుణ్ తేజ్ కి వినిపించాడట. తనకి బాగా నచ్చిందనీ .. పూర్తి కథను సిద్ధం చేసుకుని రమ్మని అన్నట్టుగా సమాచారం. ఈ లైన్ అల్లు అరవింద్ కి కూడా నచ్చడంతో, తన సొంత బ్యానర్లో ఈ సినిమాను నిర్మించడానికి సిద్ధమవుతున్నాడని అంటున్నారు. కిరణ్ కొర్రపాటితో చేయవలసిన సినిమా షూటింగు పూర్తయిన తరువాత, వక్కంతం వంశీతో కలిసి వరుణ్ తేజ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు.

Vakkantham Vamsi
Varun Tej
  • Loading...

More Telugu News