Andhra Pradesh: మాదక ద్రవ్యాలపై సమాచార సేకరణకు ఏపీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు

  • సీఐడీ విభాగంలో వాట్సప్ నెంబరు ప్రారంభం
  • ఎవరైనా ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు చేపడతాం
  • రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దుతాం: డీజీపీ గౌతం సవాంగ్

మాదక ద్రవ్యాలపై సమాచార సేకరణకు ఏపీలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. దీని ఇన్ ఛార్జి బాధ్యతలను అదనపు ఎస్పీ కేజీవీ సరితకు అప్పగించారు. ఇందుకోసం సీఐడీ విభాగంలో వాట్సప్ నెంబరు 738229611 ను ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ ప్రారంభించారు. మత్తు పదార్థాల ఉత్పత్తి, రవాణా, అమ్మకం, వినియోగంపై సమాచారాన్ని ప్రత్యేక సెల్ సేకరిస్తుంది.

ఈ సందర్భంగా గౌతం సవాంగ్ మాట్లాడుతూ, ఎవరైనా ఫిర్యాదు చేస్తే సత్వర చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రజలు భాగస్వాములై కచ్చితమైన సమాచారం అందించాలని, పక్కా సమాచారం అందించిన వారికి పారితోషికం అందజేస్తామని ప్రకటించారు. సమాచారం అందజేసిన వారి వివరాలను గోప్యంగా వుంచుతామని అన్నారు.

Andhra Pradesh
Gunja
Narcotic
Dgp
gowtham
  • Loading...

More Telugu News