gvl: ఏపీలో 'ఇంగ్లిష్ మీడియం తప్పనిసరి'పై రాజ్యసభలో ప్రస్తావించిన ఎంపీలు కనకమేడల, జీవీఎల్

  • రాజ్యసభలో శూన్య గంటలో మాట్లాడిన ఎంపీలు
  • ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి
  • మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చేలా కేంద్రం ఆదేశాలివ్వాలి

ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఈ రోజు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్, బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. రాజ్యసభలో ప్రస్తావించారు.

రాజ్యసభ శూన్యగంట సమయంలో వారు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అన్నారు. తెలుగు మాధ్యమంలో చదివిన వారు కూడా ఇంగ్లిష్ లో ప్రావీణ్యం పొందారన్నారు. ఏపీలో మాతృభాషకు ప్రాధాన్యతనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం సూచనలు చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను సవరించేలా కేంద్ర సర్కారు ఆదేశాలివ్వాలని అన్నారు.

gvl
Andhra Pradesh
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News