Crime News: ఆసుపత్రిలో మృతదేహం పై నగలు మాయం

  • సిబ్బందే దొంగిలించారని కుటుంబ సభ్యుల ఆరోపణ
  • హైదరాబాద్ లోని లోటస్ ఆసుపత్రిలో దారుణం
  • చికిత్స పొందుతూ మహిళ మృతి

 

చనిపోయిన మహిళ మృతదేహంపై ఉన్న నగలను మాయంచేసిన ఘటన హైదరాబాద్ లోని తిరుమలగిరి లోటస్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు... అనారోగ్యం కారణంగా ఓ మహిళను కుటుంబ సభ్యులు సదరు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె అక్కడే చనిపోయింది. చికిత్స పొందుతున్న సమయంలో ఆమె ఒంటి పై కొన్ని బంగారు ఆభరణాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత అవి కనిపించలేదు. అయితే ఆసుపత్రి సిబ్బందే వాటిని మాయం చేశారని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Crime News
Hyderabad
deadbody
gold missing
  • Loading...

More Telugu News