West Bengal: ఉప ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన టీఎంసీ... బీజేపీ పని అయిపోయిందన్న మమతా బెనర్జీ

  • మూడు స్థానాల్లోనూ గెలిచిన టీఎంసీ
  • రెండు స్థానాల్లో మూడు దశాబ్దాల తర్వాత గెలుపు
  • బీజేపీని ప్రజలు తిరస్కరించారన్న దీదీ

పశ్చిమబెంగాల్ లో 3 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ ఘన విజయం సాధించింది. ఈ మూడు స్థానాల్లో రెండు చోట్ల గత 30 ఏళ్లలో టీఎంసీ ఒక్కసారి కూడా గెలవలేదు. మూడు దశాబ్దాల తర్వాత ఖరగ్ పూర్, కలియాగంజ్ స్థానాల్లో టీఎంసీ విజయపతాకం ఎగురవేసింది. ఈ ఘన విజయాలతో, తృణమూల్ కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ, బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ రాజకీయ అహంకారానికి బెంగాల్ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. రాజకీయాల్లో అహంకారం పనికిరాదని చెప్పారు. బీజేపీని ప్రజలు తిరస్కరించారని తెలిపారు.

West Bengal
TMC
Mamata Banerjee
BJP
  • Loading...

More Telugu News