Asaduddin Owaisi: ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేం కాదు: ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ

  • గాంధీకి ప్రజ్ఞా ఠాకూర్ శత్రువు
  • ఆయనను హత్యచేసిన వారికి మద్దతుదారు
  • ఈ విషయం ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది 
  • స్పీకర్ కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చాను 

జాతిపిత మహాత్మా గాంధీని కాల్చిచంపిన నాథూరామ్ గాడ్సేని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్... 'దేశభక్తుడు'గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

'ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేం కాదు. గాంధీకి ప్రజ్ఞా ఠాకూర్ శత్రువని, ఆయనను హత్యచేసిన వారికి మద్దతుదారని ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. నేను ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్ కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చాను. ఏం జరుగుతుందో చూద్దాం' అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.

కాగా, ఈ విషయంపై లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ...  నాథూరామ్ గాడ్సేని ఎవరైనా దేశ భక్తుడిగా పేర్కొంటే, తమ పార్టీ ఈ తీరును తప్పక ఖండిస్తుందని చెప్పారు. మహాత్మాగాంధీ తమకు మార్గ దర్శకుడని స్పష్టం చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ ఈ వ్యాఖ్య చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

Asaduddin Owaisi
aimim
Hyderabad
Lok Sabha
  • Loading...

More Telugu News