Vijay Devarakonda: ఇంద్రగంటి సినిమానే ముందుగా చేసే ఆలోచనలో విజయ్ దేవరకొండ?

  • విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్'
  • పూరితో చేయవలసిన 'ఫైటర్'కి సన్నాహాలు 
  • ఇంద్రగంటి ప్రాజెక్టు వైపు మొగ్గు చూపుతున్న విజయ్ దేవరకొండ 

విజయ్ దేవరకొండ తాజా చిత్రంగా 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రం రూపొందుతోంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఆ తరువాత పూరి జగన్నాథ్ తో విజయ్ దేవరకొండ 'ఫైటర్' సినిమా చేయవలసి వుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో పూరి బిజీగా వున్నాడు.

అయితే అంతకంటే ముందుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేసే ఆలోచనలో విజయ్ దేవరకొండ ఉన్నాడనేది తాజా సమాచారం. ఇటీవల ఇంద్రగంటి మోహనకృష్ణ .. విజయ్ దేవరకొండను కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ చాలా కొత్తగా ఉండటంతో, ముందుగా ఈ కథనే చేయాలని విజయ్ దేవరకొండ తొందరపడుతున్నాడని అంటున్నారు. ఇలాంటి కథను ముందుగా చేయడం వలన కెరియర్ కి మరింత హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నాడట. 

Vijay Devarakonda
Indraganti
Puri
  • Loading...

More Telugu News