Uddhav Thackeray: ‘సామ్నా’ పత్రిక ఎడిటర్ పదవికి ఉద్ధవ్ థాకరే రాజీనామా

  • ఈ సాయంత్రం సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఉద్ధవ్ థాకరే
  • థాకరేల కుటుంబం నుంచి తొలి సీఎంగా ఘనత
  • సామ్నా ఎడిటర్ గా బాధ్యతలను చేపట్టనున్న సంజయ్ రౌత్

చరిత్రలో తొలిసారి థాకరేల కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు. ఈ సాయంత్రం ముంబైలోని శివాజీ పార్కులో సీఎంగా ఉద్ధవ్ థాకరే ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. గతంలో శివసేనకు చెందిన ఇద్దరు నేతలు మనోహర్ జోషి, నారాయణ రాణేలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు.

మరోవైపు, మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలను చేపట్టబోతున్న నేపథ్యంలో, తమ పార్టీ అధికారిక పత్రిక అయిన 'సామ్నా' పత్రిక ఎడిటర్ పదవికి ఉద్ధవ్ రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఆ పదవిని ఎంపీ సంజయ్ రౌత్ చేపట్టబోతున్నారు.  

Uddhav Thackeray
Sanjay Raut
Shivsena
  • Loading...

More Telugu News