Ashok Khemkha: 53వ సారి... బదిలీ అయిన ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా

  • సర్వీసులో ఆఖరి దశకు చేరుకున్నాను
  • నిజాయతీకి దక్కిన గౌరవం
  • చర్చనీయాంశమైన అశోక్ ట్వీట్

"నేను మరోసారి బదిలీ అయ్యాను. ఇండియాలో రాజ్యాంగ దినోత్సవాలను ఘనంగా జరుపుకున్న తదుపరి రోజే సుప్రీంకోర్టు ఆదేశాలు, నియమాలు ఉల్లంఘనకు గురయ్యాయి. నా సర్వీసులో ఆఖరి దశకు చేరుకున్నాను. నిజాయతీకి దక్కిన గౌరవం ఇది" అని ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.

ప్రస్తుతం హరియాణా సైన్స్ అండ్‌ టెక్నాలజీ విభాగం చీఫ్ సెక్రెటరీగా ఉన్న ఖేమ్కా, మరోసారి ట్రాన్స్‌ ఫర్‌ అయ్యారు. 1991 బ్యాచ్‌ కు చెందిన అశోక్‌ ఖేమ్కా, తన 28 ఏళ్ల సర్వీసు కాలంలో ఏకంగా 53 సార్లు బదిలీ అయ్యారు. గత మార్చిలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి వచ్చిన ఆయన్ను, తాజాగా, ఆర్కైవ్స్‌ విభాగానికి బదిలీ చేశారు.

Ashok Khemkha
Transfer
IAS
  • Loading...

More Telugu News