pragya thakur: గాడ్సేని దేశభక్తుడిగా పేర్కొన్న బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్!

  • మహాత్మాగాంధీపై కక్షతోనే గాడ్సే చంపేశాడన్న ఎ.రాజా
  • దేశభక్తులను ఉదాహరణలుగా చూపొద్దన్న ప్రజ్ఞా ఠాకూర్
  • ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్సేనన్న ఎంపీ

వివాదాస్పద బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మరోమారు తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఎస్పీజీ బిల్లుపై చర్చ సందర్భంగా డీఎంకే నేత ఎ.రాజా మాట్లాడుతూ.. మహాత్మాగాంధీపై గాడ్సే కక్ష పెంచుకుని చంపినట్టు పేర్కొన్నారు. దీనికి ప్రజ్ఞా ఠాకూర్ బదులిస్తూ.. దేశభక్తులను ఉదాహరణలుగా వాడొద్దంటూ పరోక్షంగా గాడ్సే దేశభక్తుడని కీర్తించారు. అలాగే, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించింది కాంగ్రెస్సేనని దుయ్యబట్టారు. 1984లో భోపాల్‌ దుర్ఘటనకు కారణమైన కార్బైడ్ సంస్థ చైర్మన్ అండర్సన్‌ను ఉగ్రవాదిగా పోల్చారు. దేశంలోని వేలాదిమంది ప్రాణాలు తీసిన విదేశీయుడిని దేశం విడిచి వెళ్లేలా చేసింది కాంగ్రెస్సేనని ప్రజ్ఞా ఠాకూర్ ఆరోపించారు.

pragya thakur
mahatma gandhi
nathuram godse
  • Loading...

More Telugu News