Paris: పారిస్ లో రైతుల వినూత్న నిరసన
![](https://imgd.ap7am.com/thumbnail/tn-cda541513eb3.jpg)
- ట్రాక్టర్లతో పట్టణంలోకి ప్రవేశించి ఆందోళన
- 10వేల ట్రాక్టర్లు రోడ్లమీదకి రావడంతో ట్రాఫిక్ జామ్
- సమస్యలు తీరే వరకు ఇదే తరహాలో నిరసన తెలుపుతామన్న ఫ్రాన్స్ రైతులు
తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఫ్రాన్స్ లోని రైతులు వినూత్నంగా నిరసన చేపట్టారు. ట్రాక్టర్లతో రాజధాని పారిస్ లోకి ప్రవేశించి నిరసన తెలిపారు. దీనితో రోడ్లన్నీ ట్రాక్టర్లతో నిండిపోయాయి. 10వేల ట్రాక్టర్లు ఒక్కసారిగా రోడ్డెక్కడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించేవరకు ఇదే తరహాలో నిరసన చేపడతామని రైతులు పేర్కొన్నారు.