Sarileru Neekevvaru movie: ప్రతీ సోమవారం అప్ డేట్స్ తో ఆకట్టుకోనున్న ‘సరిలేరు నీకెవ్వరు’
![](https://imgd.ap7am.com/thumbnail/tn-7338d611dc44.jpg)
- మహేశ్ అభిమానులకు ఇక వారం వారం పండగే
- పోస్టర్లు, పాటలు, వీడియో క్లిప్పింగ్స్ ల విడుదల
- జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అప్పటివరకు ప్రతి సోమవారం ఏదో ఒక అప్ డేట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు చిత్రం యూనిట్ సిద్ధమవుతోంది. పోస్టర్లు, పాటలు, వీడియో క్లిప్పింగ్స్ వంటివి విడుదల చేస్తూ అభిమానులకు పండుగ వాతావరణం కల్పించడానికి సిద్ధమవుతోంది. మహేశ్ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు.