west indies bowler record on Indian Pitches: ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్ ను వణికించిన విండీస్ బౌలర్ కార్న్ వాల్

  • కెరీర్ అత్యుత్తమ బౌలింగ్ తో హడలగొట్టిన స్పిన్నర్
  • భారత పిచ్ లపై బెస్ట్ బౌలింగ్ రికార్డు నమోదు
  • తొలి రోజు ఆటలో విండీస్ దే పైచేయి

ఉత్తరప్రదేశ్ లోని లక్నో వేదికగా టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న వెస్టిండీస్, ఆఫ్ఘానిస్తాన్ జట్లు హోరాహోరీగా పోరాడుతున్నాయి. తొలిరోజు ఆటలో విండీస్ దే పైచేయిగా మారింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్ ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్ ను బెంబేలెత్తించింది. ఆఫ్ఘాన్ తన తొలి ఇన్నింగ్స్ లో 187 పరుగులు మాత్రమే చేయగలిగింది. విండీస్ స్పిన్నర్  రాహ్ కీమ్ కార్న్ వాల్ 7 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘాన్ బ్యాటింగ్ ను కుప్పకూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్ లో జావెద్ అహ్మదీ చేసిన 39 పరుగులే అత్యధికం.

కార్న్ వాల్ 7/75 వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతేకాక, భారత పిచ్ లపై ఒక ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు సాధించిన మూడో విండీస్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో విండీస్ బౌలర్లలో అండీ రాబర్ట్స్, లాన్స్ గిబ్స్ కూడా ఈ ఘనతను సాధించారు. అనంతరం విండీస్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించి ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ కన్నా విండీస్ ఇంకా 119 పరుగులు వెనకబడి ఉంది.

west indies bowler record on Indian Pitches
Rahkeem Cornwall 7/75
  • Loading...

More Telugu News