cm: విజయసాయిరెడ్డి గారూ, అలా పాత పాటే పాడితే జగన్ చేతగాని వాడనే అనుమానం బలపడుతుంది: బుద్ధా వెంకన్న

  • మహిళలను, వృద్ధులను, రైతులను మోసం చేసింది జగన్
  • పేదోడి నోటి దగ్గర కూడు లాక్కున్నది జగన్
  • ఇంకా ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అంటూ పాట పాడతారా?

ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శల వర్షం కొనసాగుతోంది. పెన్షన్ పెంచుతామని చెప్పి వృద్ధులను మోసం చేసింది, 45 ఏళ్లకే బీసీ,ఎస్టీ, ఎస్సీ మహిళలకు పెన్షన్ అని చెప్పి దగా చేసింది, రైతులను వంచించింది, నిరుద్యోగులను హేళన చేసింది, అన్న క్యాంటీన్లను ఎత్తేసి పేదోడి నోటి దగ్గర కూడు లాక్కున్నది జగన్ అని విజయసాయిరెడ్డి మర్చిపోయారా? అంటూ మండిపడ్డారు.

జగన్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిందని, ఒక్క సెంటు భూమి ట్రేడింగ్ అయినట్టు ఆధారాలు చూపించలేక పోయారని విమర్శించారు. ఇంకా ‘ఇన్సైడర్ ట్రేడింగ్’ అంటూ పాత పాటే పాడితే ‘మీ ముఖ్యమంత్రి గారు చేతగాని వాడనే అనుమానం మీ పార్టీలో మరింత బలపడుతుంది సాయి రెడ్డి గారు’ అంటూ బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

cm
jagan
vijayasai reddy
mp
Buddha venkanna
  • Loading...

More Telugu News