Varun Tej: వరుణ్ తేజ్ సరసన వయ్యారి భామలు

  • బాక్సర్ గా కనిపించనున్న వరుణ్ తేజ్ 
  • దర్శకుడిగా కిరణ్ కొర్రపాటి పరిచయం 
  • వచ్చేనెల నుంచి రెగ్యులర్ షూటింగ్

వరుస విజయాలతో వరుణ్ తేజ్ తన దూకుడు చూపిస్తున్నాడు. కొత్తదనం కలిగిన కథలను మాత్రమే ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. అలాంటి వరుణ్ తేజ్ తన తదుపరి సినిమాను కిరణ్ కొర్రపాటి అనే నూతన దర్శకుడితో చేయనున్నాడు. ఈ సినిమాలో ఆయన బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన బాక్సింగ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు.

వచ్చేనెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలు అవసరం కావడంతో, కొంతమంది పేర్లను పరిశీలించారు. చివరికి నిధి అగర్వాల్ ను - నభా నటేశ్ ను ఎంపిక చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. 'ఇస్మార్ట్ శంకర్'లో ఈ అందగత్తెలు ఏ రేంజ్ లో అందాలు ఆరబోశారో తెలిసిందే. వీళ్ల ఎంపిక ఖాయమైతే, ఈ ప్రాజెక్టు క్రేజ్ పెరిగిపోయినట్టేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Varun Tej
Nidhi Agarwal
Nabha Natesh
  • Loading...

More Telugu News