Andhra Pradesh: మా తరంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్లు కలెక్టర్లయ్యారు: ఆర్.నారాయణమూర్తి

  • ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధనపై హర్షం
  • ‘సీఎం జగన్ కు హ్యాట్సాప్’
  • ‘తెలుగు’ మీడియంలో చదివితే బంట్రోతులవుతారు 

ఏపీ సీఎం జగన్ పై ప్రముఖ నటుడు ఆర్.నారాయణమూర్తి మరోమారు ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యా బోధన చేయాలన్న సర్కార్ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టాలనే నిర్ణయం తీసుకున్న ‘సీఎం జగన్ కు హ్యాట్సాప్’ అని ప్రశంసించారు.

తెలుగు భాషను కాపాడాలంటున్న వాళ్లు, మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెబుతున్న వాళ్లు తమ పిల్లల్ని మాత్రం కార్పొరేట్ పాఠశాలల్లో చదివిస్తున్నారని విమర్శించారు. తమ తరంలో ఇంగ్లీషు మీడియంలో చదువుకున్న పలువురు ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్నారని చెప్పిన నారాయణమూర్తి, తెలుగు మీడియంలో చదువుకుంటే బడుగు, బలహీనవర్గాల పిల్లలు బంట్రోతులు అవుతారని అభిప్రాయపడ్డారు.

Andhra Pradesh
cm
jagan
R.Narayana murthy
  • Loading...

More Telugu News