kamma rajyam lo kadapa redlu movie: 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమా విడుదలపై ఉత్కంఠ

  • సినిమాపై పిటిషన్ వేసిన కేఏ పాల్
  • సినిమా పూర్తి రివ్యూను ఇవ్వాలని నిర్మాతలను ఆదేశించిన హైకోర్టు
  • సెన్సార్ పూర్తి కాగానే ఇస్తామన్న నిర్మాతలు

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' విడులవుతుందా, లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రంలో తనను అగౌరవపరిచేలా పాత్రను చిత్రీకరించారని కేఏ పాల్ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను ఇవ్వాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది. అయితే, సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి కాలేదని కోర్టుకు నిర్మాతలు తెలిపారు. రేపు సినిమాకు సంబంధించిన రివ్యూను ఇవ్వాలని ఆదేశిస్తూ... విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.

kamma rajyam lo kadapa redlu movie
  • Loading...

More Telugu News