kammarajyam lo kadapa redlu: బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లపై ప్రశ్నలకు వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

  • 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' ప్రమోషన్ కార్యక్రమం
  • హీరోలను పోలిన పాత్రలు వున్నాయా? అన్న విలేకరి
  • బాలకృష్ణ పాత్ర లేదన్న వర్మ

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్మ మాట్లాడారు. మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.

'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' లో సినీ హీరోలను పోలిన పాత్రలు ఏమైనా వున్నాయా? అన్న ప్రశ్నకు వర్మ స్పందిస్తూ, ‘లేదు. బాలకృష్ణ గారు లేరు. నీ క్వశ్చన్ అదైతే’ అని అన్నారు.

ఈ చిత్రం ట్రైలర్ లో ‘ఓ బుడ్డోడు రాబోతున్నాడు’ అన్న వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ గురించా? అనే ప్రశ్నకు ‘మీరేమనుకుంటున్నారో చెబితే నేను చెబుతా’ అంటూ వర్మ ఆసక్తికర జవాబిచ్చారు. ‘మీ కంపెనీ ముంబై నుంచి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిందా? అని ప్రశ్నించగా, ‘లేదు. రెండు చోట్లా వుంది’ అని వర్మ స్పష్టం చేశారు.

kammarajyam lo kadapa redlu
Balakrishna
Junior Ntr
Hero
Director
Ram gopal varma
Tollywood
  • Loading...

More Telugu News