Nageswar Reddy: నాగేశ్వర రెడ్డి నుంచి మరో విభిన్న కథా చిత్రం

  • హాస్య చిత్రాల దర్శకుడిగా నాగేశ్వర రెడ్డి 
  •  పట్టాలపైకి మరో ప్రాజెక్టు
  • 'అల్లరి' నరేశ్ ను సెట్ చేసే ఛాన్స్   

హాస్యభరిత చిత్రాలను తెరకెక్కించడంలో జి.నాగేశ్వరరెడ్డికి మంచి అనుభవం వుంది. పెర్ఫెక్ట్ కంటెంట్ తో కడుపుబ్బా నవ్వించడం ఆయనకి బాగా తెలుసు. అయితే ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్' మాత్రం ఆశించినస్థాయిలో హాస్యప్రియులను అలరించలేకపోయింది. ఆ సంగతి అటుంచితే ఇప్పుడు అయన మరో కథను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు.

'యాక్షన్' సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన ఆడెపు శ్రీనివాస్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నాగేశ్వరరెడ్డి తన దగ్గరున్న కథకు తగిన హీరోను వెతికి పట్టుకునే పనిలో వున్నాడని అంటున్నారు. 'అల్లరి' నరేశ్ తో ఆయనకి మంచి హిట్స్ వున్నాయి గనుక, ఈ హిట్ కాంబినేషన్ మరో మారు సెట్ అవ్వచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Nageswar Reddy
Allari Naresh
  • Loading...

More Telugu News