Sampoornesh Babu: కారు ప్రమాదం: పోలీస్ స్టేషన్ లో సంపూర్ణేశ్ బాబు ఫిర్యాదు

  • సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద కారు ప్రమాదం 
  • కారును పోలీస్ స్టేషన్ కు తరలించిన పోలీసులు 
  • ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్

సిద్ధిపేట కొత్త బస్టాండ్ వద్ద సినీ నటుడు సంపూర్ణేశ్ బాబుకు ఈ రోజు ఉదయం ప్రమాదం తప్పిన విషయం తెలిసిందే. ఆయన కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో.. కారు స్వల్పంగా ధ్వంసమైంది. అనంతరం ప్రమాద స్థలికి చేరుకున్న పోలీసులు ఆ కారును పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ ప్రమాదంపై సిద్ధిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంపూర్ణేశ్ బాబు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ బస్సు తాత్కాలిక డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడా? అన్న విషయంపై పోలీసులు ఆరా తీశారు. డ్రైవర్ కు బ్రెత్ ఎనలైజర్ తో పరీక్ష చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Sampoornesh Babu
Siddipet District
Road Accident
  • Loading...

More Telugu News